TS News : నేడు 5 నుంచి 10 సెం.మీ. వర్షం కురిసే అవకాశం..

ABN , First Publish Date - 2023-07-26T08:30:46+05:30 IST

గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు బుధవారం హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నేడు వాతావరణ శాఖ జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది.

TS News : నేడు 5 నుంచి 10 సెం.మీ. వర్షం కురిసే అవకాశం..

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు బుధవారం హైదరాబాద్‌ వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నేడు వాతావరణ శాఖ జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేసింది.

ఇక వర్షం విషయానికి వస్తే.. గంటకు 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని.. కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రేపు కూడా ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం ఓ మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - 2023-07-26T08:30:46+05:30 IST