Share News

Hyderabad: తెలంగాణకు బీజేపీ జాతీయ నేతల క్యూ

ABN , First Publish Date - 2023-11-20T08:28:01+05:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారఘట్టం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తెలంగాణ టార్గెట్ చేసిన బీజేపీ.. రాష్ట్రంలో పర్యటించేందుకు జాతీయ నేతలు క్యూ కట్టారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు.

Hyderabad: తెలంగాణకు బీజేపీ జాతీయ నేతల క్యూ

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారఘట్టం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో తెలంగాణ టార్గెట్ (Telangana Target) చేసిన బీజేపీ (BJP) రాష్ట్రంలో పర్యటించేందుకు జాతీయ నేతలు క్యూ (National Leaders Que) కట్టారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు (Public Meetings), రోడ్ షో (Road Show)లు, మీడియా సమావేశాలు (Media Conferences) నిర్వహించనున్నారు. సోమవారం తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రానున్నారు. జనగామ, కోరుట్ల బహిరంగ సభల్లో‌ పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో ఆయన రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ (Smriti Irani) 25, 26న‌ హుజురాబాద్, మహేశ్వరంలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఈనెల 24, 25, 26న తెలంగాణకు రానున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ (Himant Biswa Sharma), గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ (Pramod Sawant)లు కూడా తెలంగాణ పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) 21వ తేదీన రెండు సభల్లో పాల్గొననున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం ఎల్లారెడ్డి, కొల్లాపూర్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ముషీరాబాద్ రోడ్ షోలో పాల్గొంటారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకతపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించనున్నారు.

Updated Date - 2023-11-20T08:28:03+05:30 IST