Medals: 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2023-08-14T16:43:49+05:30 IST

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించింది.

Medals: 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాలను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Central Govt.) 954 మంది పోలీసులకు పోలీస్‌ సేవా పతకాల (Police Service Medals)ను ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు (Police Gallantry Medals), 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు (Visista Service Medals), 642 మందికి పోలీసు సేవా పతకాలు (Police Service Medals) ప్రకటించింది.

తెలంగాణ నుంచి 34 మంది ఎంపిక కాగా.. ఏపీ నుంచి 29 మంది పోలీసులకు పతకాలు దక్కాయి. ఏపీ నుంచి ఒక్కరికి రాష్ట్రపతి పోలీస్‌ విశిష్ఠ సేవా పతకం, 18 మందికి పోలీస్‌ గ్యాలంటరీ పతకాలు, 10 మందికి విశిష్ఠ సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 22 మందికి పోలీస్‌ గ్యాలంటరీ, పది మందికి పోలీస్‌ సేవా పతకాలు, మరో ఇద్దరు తెలంగాణ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌లకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ గ్యాలంటరీ పతకాలు పొందిన 22 మంది వివరాలు...

ఎస్పీ భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు.. శివప్రసాద్, పురుషోత్తంరెడ్డి, ఆర్ఐ రమేష్, ఎస్‌ఐ బండారి కుమార్, ఆర్ఎస్ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్‌కానిస్టేబుళ్లు.. ఆదినారాయణ, అశోక్ గ్యాలంటరీ పతకాలు పొందారు. గ్యాలంటరీ పతకాలు పొందిన వారిలో కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్‌ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్ తదితరులు.

తెలంగాణ నుంచి పోలీస్‌ సేవా పతకాలు లభించిన పది మంది పోలీసుల వివరాలు :

బండి వెంకటేశ్వర రెడ్డి అదనపు ఎస్పీ, ఖైరతాబాద్, మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు అదనపు ఎస్పీ, ఆత్మకూరి వెంకటేశ్వరి అదనపు ఎస్పీ, ఆందోజు సత్యనారాయణ ఆర్ఎస్ఐ, కక్కెర్ల శ్రీనివాస్ ఆర్ఎస్ఐ, మహంకాళి మధు ఆర్ఎస్ఐ, అజెల్ల శ్రీనివాస రావు ఆర్ఐ, రసమోని వెంకటయ్య సీనియర్ కమాండో, అరవేటి భాను ప్రసాద్ రావు ఇన్‌స్పెక్టర్, హైదరాబాద్, సాయన వెంకటేశ్వర్లు ఏఎస్ఐ.

Updated Date - 2023-08-14T16:43:49+05:30 IST