Heart Attack : లాలాపేట స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ప్లేయర్...

ABN , First Publish Date - 2023-03-01T11:29:43+05:30 IST

ఇటీవలి కాలంలో మనం గుండెపోటుల గురించి తరచూ వింటూ వస్తున్నాం. ముఖ్యంగా జిమ్ చేస్తూనో.. లేదంటే ఏదైనా గేమ్ ఆడుతూనో సడెన్‌గా కుప్పకూలడం సర్వసాధారణమై పోయింది. వయసుతో సంబంధం కూడా లేదు.

Heart Attack : లాలాపేట స్టేడియంలో బ్యాడ్మింటన్‌ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన ప్లేయర్...

హైదరాబాద్‌ : ఇటీవలి కాలంలో మనం గుండెపోటుల గురించి తరచూ వింటూ వస్తున్నాం. ముఖ్యంగా జిమ్ చేస్తూనో.. లేదంటే ఏదైనా గేమ్ ఆడుతూనో సడెన్‌గా కుప్పకూలడం సర్వసాధారణమై పోయింది. వయసుతో సంబంధం కూడా లేదు. తాజాగా లాలాపేట స్టేడియంలో గుండెపోటుతో ఒకరు మృతి చెందారు. బ్యాడ్మింటన్‌ ఆడుతూపరమేష్‌యాదవ్‌(38) అనే వ్యక్తి కుప్పకూలాడు. వెంటనే అక్కడున్న వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్టు వైద్యుల ధృవీకరించారు.

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్.. ఏదైతేనేమి ఇలా వచ్చి అలా ప్రాణాలను హరిస్తున్నాయి. గతంలో 60 ఏళ్లు పై బడిన వారికి మాత్రమే గుండెపోటు ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నుంచి మొదలు.. తరుచుగా ఈ సడెన్ డెత్స్‌కి సంబంధించిన వార్తలు వింటూ వస్తున్నాం. ఇటీవల తారకరత్న సైతం యాక్టివ్‌గా తిరుగుతూనే ఒక్కసారిగా కుప్పకూలాడు. క్షణాల్లో వైద్యం అందినా కూడా ఫలితం లేకుండా పోయింది. మొన్నటికి మొన్న పెళ్లి కొడుకుకు చందనం రాస్తూ ఒక వ్యక్తి కుప్పకూలాడు. ఆ తరువాత ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ హఠాన్మరణం పాలయ్యాడు. అలాగే 19 ఏళ్ల కుర్రాడు సైతం డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.

ఇదీ చదవండి..

గుండె పోటుతో కుర్రాడు మృతి.. వయసెంతో తెలుస్తే నివ్వెరపోతారు.. వీడియో వైరల్

Updated Date - 2023-03-01T11:29:43+05:30 IST