BJP high command: హైకమాండ్ నుంచి బండికి ఫోన్ల మీద ఫోన్లు..ఏం చెప్పారంటే..?

ABN , First Publish Date - 2023-04-07T12:07:16+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీజేపీ హైకమాండ్‌..

BJP high command: హైకమాండ్ నుంచి బండికి ఫోన్ల మీద ఫోన్లు..ఏం చెప్పారంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి(Telangana State BJP President Bandi Sanjay) బీజేపీ హైకమాండ్‌(BJP high command) నుంచి ఫోన్‌ వచ్చింది. బండి సంజయ్‌కి కేంద్రమంత్రి అమిత్‌ షా(Union Minister Amit Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP President JP Nadda), ఎంపీ స్మృతి ఇరానీ(MP Smriti Irani).. ఫోన్‌ చేసి మాట్లాడారు. వారితో పాటు తరుణ్‌ చుగ్‌(Tarun Chugh), సునీల్‌ బన్సల్‌(Sunil Bansal), పలువురు జాతీయ నేతలు బండి.. 'గో ఎహెడ్‌'.. హైకమాండ్‌ మీకు అండగా ఉంది. ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలని హైకమాండ్‌ ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీ (BRS) కుట్రలను ఛేదిద్దాం, ప్రజా సమస్యలపై పోరాడండి అంటూ సంజయ్‌కు అగ్రనేతలు చెప్పినట్లు సమాచారం.

కాగా, బండి సంజయ్ (Bandi Sanjay) నేడు (శుక్రవారం) ఉదయం కరీంనగర్ జైలు(Karimnagar Jail) నుంచి విడుదల అయ్యారు. విడుదలకు ముందు జైలు దగ్గర భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కరీంనగర్ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే.. తీవ్ర ఉత్కంఠ.. సుదీర్ఘ, హోరాహోరీ వాదనల తర్వాత పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌కు బెయిల్‌ మంజూరైంది. రూ.20 వేల పూచీకత్తుతోపాటు ఇద్దరి జమానతు సమర్పించాలని హనుమకొండ నాలుగో అదనపు మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ ఇన్‌చార్జి న్యాయమూర్తి రాపోలు అనిత తీర్పు వెలువరించారు. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు.

Updated Date - 2023-04-07T12:13:30+05:30 IST