MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2023-02-06T14:55:53+05:30 IST

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి పరిణామం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Purchase Case)ను సీబీఐ (CBI)కి హైకోర్టు (Telangana High Court)అప్పగించడం మంచి పరిణామం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishnam Raju) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీఫెన్ రవీంద్ర (Stephen Ravindra) అనే అధికారి తన పేరును కూడా చేర్చారన్నారు. రెండు రాష్ట్రాలకు స్టీఫెన్ రవీంద్ర పని చేస్తున్నట్టు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వాలను స్టీఫెన్ రవీంద్ర తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) కూడా తప్పుదోవ పట్టించి ఉంటారని తెలిపారు. కేసు విచారణ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర పాత్రపై కూడా సీబీఐ విచారణ (CBI investigation)చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు.

కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈకేసులో సీబీఐ విచారణకు ధర్మాసనం పచ్చజెండా ఊపించింది. ఈ కేసుకు సంబంధించి సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్ధించింది. ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఈ ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని... అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది.

Updated Date - 2023-02-06T14:55:54+05:30 IST