Talasani Condolence: ‘తెలుగు చిత్రసీమకు ఎనలేని ప్రతిష్టను తెచ్చిన గొప్ప దర్శకులు విశ్వనాథ్’

ABN , First Publish Date - 2023-02-03T09:38:22+05:30 IST

ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ మరణం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Talasani Condolence: ‘తెలుగు చిత్రసీమకు ఎనలేని ప్రతిష్టను తెచ్చిన గొప్ప దర్శకులు విశ్వనాథ్’

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ (Director K Viswanath) మరణం పట్ల రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Telangana Cinematography Minister Thalasani Srinivas Yadav) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా గొప్ప గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసుకొచ్చిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ అని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ... కుంటుంబ సభ్యులకు మంత్రి తలసాని ప్రగాడ సానుభూతిని తెలిపారు.

Updated Date - 2023-02-03T09:43:53+05:30 IST