Share News

Minister Sithakka: నన్ను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారు

ABN , First Publish Date - 2023-12-09T15:03:58+05:30 IST

Telangana: తనను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయడమే తాను చేసిన తప్పు అయిందన్నారు. అసెంబ్లీలో తనను ఉండకుండా చేయాలని అనుకున్నారన్నారు.

Minister Sithakka: నన్ను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారు

హైదరాబాద్: తనను ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారని మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయడమే తాను చేసిన తప్పు అయిందన్నారు. అసెంబ్లీలో తనను ఉండకుండా చేయాలని అనుకున్నారన్నారు. ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి ఆపాలని చూశారని విమర్శించారు. ఇంత టార్గెట్ చేస్తారని అనుకోలేదన్నారు. ఇన్ని రోజులు ప్రశ్నించామని.. ఇకపై బాధ్యతతో పని చేస్తామన్నారు. రైతుబంధు గైడ్లైన్స్ సరిగా లేవని.. రైతులు కాని వాళ్ళకి కూడా రైతుబంధు ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని చీకటిమయం చేసే కుట్ర చేశారని మంత్రి సీతక్క విమర్శలు గుప్పించారు.

Updated Date - 2023-12-09T15:03:59+05:30 IST