Minister Sabita Reddy: బాలాపూర్ గణేష్‌కు తొలి పూజ చేసిన మంత్రి సబితా

ABN , First Publish Date - 2023-09-18T23:49:51+05:30 IST

అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh)కి తొలి రోజు పూజ చేసే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy) వ్యాఖ్యానించారు.

Minister Sabita Reddy: బాలాపూర్ గణేష్‌కు తొలి పూజ చేసిన మంత్రి సబితా

హైదరాబాద్: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన బాలాపూర్ గణనాథుడి(Balapur Ganesh)కి తొలి రోజు పూజ చేసే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(
Minister Sabitha Indra Reddy) వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి, కుమారుడు కౌశిక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరికీ మేలు జరగాలని మహేశ్వరం నియోజకవర్గం పాడిపంటలతో అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడాలని బాలాపూర్ వినాయకుడిని కోరుకున్నాను. నవరాత్రుల పాటు ప్రజలు పూజలు చేస్తారని దీంతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రికి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2023-09-18T23:49:51+05:30 IST