TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

ABN , First Publish Date - 2023-02-12T11:50:14+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి.

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. కాగా ఈరోజుతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లులు అంచనా వ్యయంపై శాసనమండ

లిలో చర్చ జరిగి ఆమోదం కానుంది. అలాగే ఈరోజు మండలి డిప్యూటీ చైర్మన్ (Deputy Chairman) ఎన్నిక జరగనుంది. అయితే ఎమ్మెల్సీ బండ ప్రకాష్ (Banda Prakash) ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాగా ఉభయసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రసంగించనున్నారు.

ప్రస్తుతం శాసన సభ, మండలిలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. పట్టణ ప్రాంతంలో బస్తీ ధవాఖానాలు, రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలు, కళాశాలు, హరితవనం విస్తీర్ణం పెంపుదల, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడికాయల మార్కెట్ల ఏర్పాటు, పంటల రుణమాఫీ, రాష్ట్రంలో కోతుల బెడద, అక్షరాస్యత, బోద్ మండలంలో నూతన అగ్ని బాబాకు కేంద్రం తదితర వాటికి మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు...

ఇది కూడా చదవండి..

జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌.. ఈ సోద‌రి జీవిత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌..

బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖాలు ప్రారంభించారని, అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harishrao) అన్నారు. పేద ప్రజల సుస్తీలు పోగొట్టి, దోస్తీ దవాఖనలుగా పేరు గాంచాయన్నారు. రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామన్నారు. 57 పరీక్షలు చేస్తున్నామని, 134 రకాల పరీక్షలు త్వరలో పెంచుతామన్నారు. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానలకు సెలవు ఇస్తున్నామని, 158 రకాల మందులు ఉచితంగా అందజేస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపి తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. అయితే శ‌స్త్ర చికిత్స‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిందని, సీరియ‌స్ పేషెంట్ల‌కు వైద్యం అందించ‌డంపై ఎక్కువ దృష్టి పెట్ట‌డం పెద్దాసుప‌త్రుల్లో సాధ్యం అవుతుందన్నారు. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారని, వచ్చే ఏప్రిల్‌లో అన్ని జిల్లాలకు న్యూట్రిషన్ కిట్‌లు అందజేస్తామన్నారు. బస్తీ దవాఖానలో త్వరలో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెడతామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1500 ఆశా పోస్టులు ఈ నెలలో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-12T12:55:11+05:30 IST