Share News

Manickam Tagore.. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారన్న నమ్మకం ఉంది: మానిక్కం ఠాగూర్

ABN , First Publish Date - 2023-12-06T09:06:41+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌ను గురువారం ఉదయం జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Manickam Tagore.. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారన్న నమ్మకం ఉంది: మానిక్కం ఠాగూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌ను గురువారం ఉదయం జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి తనను ఆహ్వానించారన్నారు. ఆయన సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

‘‘ఒక సోదరుడిగా తెలంగాణ ముఖ్యమంత్రికి నా ఎంపీ ఫ్లాట్‌లో ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.. రేపు హైదరాబాద్‌లో జరిగే చారిత్రాత్మక ఘట్టానికి నన్ను ఆహ్వానించడానికి ఆయన వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ను ఆయన ఉన్నత శిఖరాలకు ఎక్కించినట్లే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపిస్తారన్న నమ్మకం నాకుంది.’’ అంటూ మానిక్కం ఠాగూర్ పోస్టు చేశారు.

Updated Date - 2023-12-06T09:06:43+05:30 IST