Manchu Lakshmi : ఇండిగో ఫ్లైట్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం..

ABN , First Publish Date - 2023-03-07T12:48:17+05:30 IST

ఇండిగో విమానయాన సంస్థపై మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిగా ఉంటే పని అవదని.. విమానంలో తన బ్యాగు మరచిపోవడంతో గేటు బయట 40 నిమిషాల పాటు కూర్చోవాల్సి వచ్చిందని ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి తెలిపారు.

Manchu Lakshmi : ఇండిగో ఫ్లైట్‌లో మంచు లక్ష్మికి చేదు అనుభవం..

Manchu Lakshmi : ఇండిగో (Indigo) విమానయాన సంస్థపై మంచు లక్ష్మి (Manchu Lakshmi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిగా ఉంటే పని అవదని.. విమానంలో తన బ్యాగు మరచిపోవడంతో గేటు బయట 40 నిమిషాల పాటు కూర్చోవాల్సి వచ్చిందని ట్విటర్ (Twitter) వేదికగా మంచు లక్ష్మి తెలిపారు. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని.. ఇండిగో సిబ్బంది పట్టనట్టే వ్యవహరించారని ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చింది. ‘మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా?’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. కొన్ని నెలల క్రితం నటుడు రానా (Actor Rana) సైతం ఇండిగో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిన్న తిరుపతి నుంచి మంచు లక్ష్మి హైదరాబాద్ వచ్చింది.

హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం తను మరచిపోయిన బ్యాగ్‌ని కలెక్ట్ చేసుకునేందుకు దాదాపు 40 నిమిషాల పాటు గేటు బయట వెయిట్ చేశానని.. సిబ్బంది ఎవరూ కూడా అసలు పట్టించుకోలేదని ఇండిగోను ట్యాగ్ చేస్తూ చెప్పుకొచ్చింది. తాను అప్పటికే 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని తన బ్యాగ్ ఒకటి మరచిపోతే సిబ్బందికి తెలియజేసినా కూడా ఎవరూ రెస్పాండ్ అవకపోవడంతో దానిని కలెక్ట్ చేసుకునేందుకు 40 నిమిషాలు పట్టిందని చెప్పింది. తను తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని అసహనం వ్యక్తం చేసింది. దీనిపై ఇండిగో కూడా స్పందించింది. ‘‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం.. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’’ అని ఇండిగో పేర్కొంది. లక్ష్మీ మంచు మాత్రం బ్యాన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్‌ను తన ట్వీట్‌కు యాడ్ చేయడం గమనార్హం.

Updated Date - 2023-03-07T12:48:17+05:30 IST