MadhuYashki : జగన్‌ గెలిచేందుకు కేసీఆర్ సూట్‌కేసులు అందించారు

ABN , First Publish Date - 2023-09-19T13:41:40+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు.

MadhuYashki :  జగన్‌ గెలిచేందుకు కేసీఆర్ సూట్‌కేసులు అందించారు

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. ఆయన అక్రమ అరెస్టును మధుయాష్కీ ఖండించారు. ఏపీ సీఎం జగన్, కేసీఆర్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారన్నారు. జగన్‌ గెలిచేందుకు కేసీఆర్ సూట్‌కేసులు అందించారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ ఒక్కటేనని మధుయాష్కీ అన్నారు. కేసీఆర్, జగన్, ప్రధాని మోదీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించాలని మధుయాష్కీ అన్నారు.

Updated Date - 2023-09-19T13:41:40+05:30 IST