Share News

MLC Kavita: లండన్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2023-10-30T14:58:20+05:30 IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లండన్ చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

MLC Kavita: లండన్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavita: రెండు రోజుల పర్యటన నిమిత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavita) లండన్ (London) చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో ఎన్నారైలు (NRI), బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Activists) ఆమెకు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు ఆక్స్ ఫర్డ్‌ (Oxford)లో కీలకోన్యాసం చేయనున్నారు.

పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రఖ్యాత బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు కవిత లండన్‌కు వెళ్లారు. భారత్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహిస్తున్న సమావేశంలో కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.

Updated Date - 2023-10-30T14:58:20+05:30 IST