T.Highcourt: చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2023-06-21T16:09:23+05:30 IST

చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. బాలల సంక్షేమ గృహాల్లో పరిస్థితులపై హైకోర్టుకు న్యాయ సేవాధికార సంస్థ నివేదిక అందజేసింది. రాష్ట్రంలో చైల్డ్ హోంలన్నీ ఎన్జీవోలే నిర్వహిస్తున్నాయని న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల సంక్షేమ గృహాలు లేవని వెల్లడించింది. రాష్ట్రంలోని చైల్డ్ హోమ్‌లలో దయనీయ స్థితి ఉందని కోర్టుకు తెలియజేసింది.

T.Highcourt: చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో విచారణ

హైదరాబాద్: చిన్నారుల అదృశ్యం, మానవ అక్రమ రవాణపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. బాలల సంక్షేమ గృహాల్లో పరిస్థితులపై హైకోర్టుకు న్యాయ సేవాధికార సంస్థ నివేదిక అందజేసింది. రాష్ట్రంలో చైల్డ్ హోంలన్నీ ఎన్జీవోలే నిర్వహిస్తున్నాయని న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న బాలల సంక్షేమ గృహాలు లేవని వెల్లడించింది. రాష్ట్రంలోని చైల్డ్ హోమ్‌లలో దయనీయ స్థితి ఉందని కోర్టుకు తెలియజేసింది. మానవ అక్రమ రవాణ అనేక దేశాల్లో అతి పెద్ద నేరంగా ఉందని హైకోర్టు పేర్కొంది. అంతర్జాతీయంగా డ్రగ్స్, వన్యప్రాణులు, మానవ రవాణ అక్రమ వ్యాపారం ఎక్కువగా ఉందని న్యాయస్థానం తెలిపింది. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణ నియంత్రణకు ప్రత్యేక విభాగం ఉండాలని... నియంత్రణ, బాధితులను రక్షించడం, పునరావాసం, సమాజంలో కలపడం కీలకమని హైకోర్టుల పేర్కొంది. సున్నితమైన అంశంపై దర్యాప్తు, న్యాయ అధికారుల్లోనూ అవగాహన పెంచాలని తెలిపింది. పిటిషన్లపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులు ఇస్తామన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.


******************************

ఇవి కూడా చదవండి..

******************************

Group-1: గ్రూప్-1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్

******************************

Delhi: రోజూ బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయి.. బీఆర్‌ఎస్ ఎంపీ ముందు దుర్గం చిన్నయ్య బాధితురాలి ఆవేదన



Updated Date - 2023-06-21T16:22:29+05:30 IST