Falaknuma Train Accident : చైన్ లాగి అంత మందిని కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-07-07T13:42:47+05:30 IST

హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలులో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Falaknuma Train Accident : చైన్ లాగి అంత మందిని కాపాడిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే..

యాదాద్రి : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు (Train No - 12703)లో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో ఆరు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. అయితే ప్రస్తుతం ఆ చైన్ లాగిన వ్యక్తి పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. ఆ తరువాత అతను పడిన ఆందోళనకో ఏమో కానీ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వెంటనే రైల్వే సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక చైన్ లాగిన వ్యక్తిది శ్రీకాకుళం జిల్లా పలాస అని సమాచారం.

Updated Date - 2023-07-07T13:42:47+05:30 IST