Hyderabad: ఎక్కాలు ఈ విధంగా చెప్పే పిల్లలు చాలా అరుదు.. అందరిలా కాదు..
ABN , First Publish Date - 2023-03-05T11:21:12+05:30 IST
ఎక్కాలు (Tables) చెప్పమంటే మహా అయితే 20 వరకు చెబుతాం. స్పీడ్‌గా చెప్పమంటే అతికష్టం మీద అప్పజెప్పుతాం. అదే రివర్స్ ఆర్డర్ (Reverse Order) లో చెప్పమంటే అమ్మో కష్టం అంటాం.
అడ్డగుట్ట/తార్నాక (ఆంధ్రజ్యోతి): ఎక్కాలు (Tables) చెప్పమంటే మహా అయితే 20 వరకు చెబుతాం. స్పీడ్‌గా చెప్పమంటే అతికష్టం మీద అప్పజెప్పుతాం. అదే రివర్స్ ఆర్డర్ (Reverse Order) లో చెప్పమంటే అమ్మో కష్టం అంటాం. విద్యార్థులకయితే ఇది ఒక టాస్క్.. అయితే ఎక్కాలు చెప్పడంలో ఈ బాలుడు అందరి విద్యార్థుల్లా కాదు.. 20 ఎక్కాలను చెప్పడటమే కాదు.. వాటిని రివర్స్‌లోకూడా చెప్పడంలో దిట్ట ఈ విద్యార్థి.. 30వ ఎక్కం ప్రారంభించి 1వ ఎక్కం వరకు రివర్స్‌లో చెప్పడంలో ఈ విద్యార్థి ప్రత్యేక అంతా ఇంతాకాదు.. రివర్స్ టేబుల్స్ చెప్పడం పెద్ద కష్టం కాదని ఎనిమిదేళ్ల బాలుడు నిరూపించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు (Telugu Book of Record) లో స్థానం సంపాదించాడు ఈ విద్యార్థి.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పోలీస్ కంట్రోల్ రూంలో ఉద్యోగం చేస్తున్న విజయ్‌కుమార్, సౌజన్య దంపతుల కుమారుడు తోక శివాజీ. 30వ ఎక్కం నుంచి ప్రారంభించి ఒకటో ఎక్కం వరకు రెండు అంకెల ఎక్కాల పట్టికను రివర్స్ ఆర్డర్‌లో నాలుగు నిమిషాల 24 సెకండ్లలో తడుముకోకుండా చెప్పి రికార్డు సృష్టించాడు. మాస్టర్ శివాజీ నైపుణ్యాన్ని గుర్తిస్తూ ప్రశంసిస్తూ వ్యవస్థాపక చైర్మన్ అధ్యక్షుడు డాక్టర్ చింతపట్ల వెంకటాచారీ లాలాపేట్‌లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అందించారు. విద్యార్థి ప్రతిభను చూసిన ఉపాధ్యాయులు, హర్షం వ్యక్తం చేశారు.