CV Anand: 35ఏళ్ల తరువాత హైదరాబాద్ సిటీ పోలీస్ రీ ఆర్గనైజేషన్

ABN , First Publish Date - 2023-05-20T13:41:57+05:30 IST

35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు.

CV Anand: 35ఏళ్ల తరువాత హైదరాబాద్ సిటీ పోలీస్ రీ ఆర్గనైజేషన్

హైదరాబాద్: 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) అన్నారు. శనివారం కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరుగిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు చేయడంతో పాటు శాంతి భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారన్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ల పెంపుదల, జోన్ల రూపుపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని తెలిపారు. 6 నెలల పాటు రీ ఆర్గనైజేషన్ కమిటీ కూర్చుని కొత్త పోలీస్‌స్టేషన్లకు ప్రతిపాదన చేసిందని అన్నారు. 35 ఏళ్ల కింద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 లక్షల మంది జనాభా ఉండేవారని... ఇప్పుడు 85 లక్షలకు పెరిగిందన్నారు. 1987లో 8,76,126 వాహనాలు ఉంటే ఇప్పుడు 80,70,852 వాహనాలు పెరిగాయని సీపీ చెప్పారు.

సెక్రటేరియట్ కోసం కొత్త పీఎస్...

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లు కలిపి 1.60 కోట్ల మంది జనాభా శాంతి భద్రతలు కంట్రోల్ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కొత్త డీసీపీ జోన్లు, 11 ఏసీపీ డివిజన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లు, 5 కొత్త ఉమెన్ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్‌స్టేషన్లలో కేసులు పెరుగుతుండటంతో భారమవుతోందన్నారు. సెక్రటేరియట్ కోసం కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని... సెక్రటేరియట్ పోలీస్‌స్టేషన్‌ను బీఆర్‌కే ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెక్రటేరియట్ సెక్యూరిటీ కోసం ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు డ్యూటీలో ఉంటారన్నారు. సైబర్ క్రైమ్ కోసం.. ఒక డీసీపీతో పాటు మొత్తం 148 మంది పోలీస్ అధికారులను కేటాయించినట్లు చెప్పారు.

జూన్ 2 నుంచి...

జూన్ 2 నుంచి కొత్త పోలీస్ స్టేషన్స్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామన్నారు. 35% సివిల్ కానిస్టేబుల్స్ వేకెన్సీలు ఉన్నాయని, 120 ఎస్‌ఐ పోస్టులు వేకెన్సీ ఉన్నాయని చెప్పారు. కొత్త పోలీస్‌స్టేషన్లకు సరిపడే వెహికిల్స్, కంప్యూటర్స్, బైక్స్ ఇస్తామని వెల్లడించారు. కొత్త పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించిందని సీపీ ఆనంద్ పేర్కొన్నారు.

కొత్త పోలీస్ స్టేషన్‌లు కలిపి ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరెట్‌లో 78 పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు.

  • అబిడ్స్ పోలీస్ స్టేషన్‌గా హైదరాబద్ కలక్టరేట్ బిల్డింగ్

  • బీఆర్‌కే భవన్‌లో సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్

  • ఫిలింనగర్‌లో ఆపరేటివ్ సొసైటీ ప్రెమిసెస్‌లో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు

  • మధురానగర్ పోలీస్ స్టేషన్‌గా రెహ్మత్ నగర్ ఓపీ బిల్డింగ్

  • సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్

  • హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్‌లో మాసబ్‌ట్యాంక్ పోలీస్ స్టేషన్

  • బోరబండ ఔట్ పోస్ట్ పోలీస్ వద్ద బోరబండ పోలీస్ స్టేషన్

Updated Date - 2023-05-20T13:51:12+05:30 IST