Share News

TS HighCourt: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:40 PM

Telangana: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కమిషన్ నివేదికపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌లపై తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ పిటిషన్‌లను న్యాయస్థానం డిస్పోజ్‌ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్‌లో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

TS HighCourt: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు తీర్పు

హైదరాబాద్: దిశ కేసు ఎన్‌కౌంటర్‌ వ్యవహారంపై హైకోర్టు (Telangana HighCourt) తీర్పు ఇచ్చింది. కమిషన్ నివేదికపై హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌లపై తీర్పు వెల్లడించింది. ఇంప్లీడ్ పిటిషన్‌లను న్యాయస్థానం డిస్పోజ్‌ చేసింది. తుది వాదనలను ఫైనల్ హియరింగ్‌లో వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తం 5 ఇంప్లీడ్ పిటిషనర్లు తమ వాదనాలు వినిపించారు. అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్, పోలీస్ అఫీసర్స్ సంఘం, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, దిశా కుటుంబం తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్ అధికారులపై 302 కేసు నమోదు చేయాలన్న కమిషన్ చెప్పగా.. సిట్ ఇప్పటికే కేసు నమోదు చేసిందని మళ్ళీ ఇప్పుడు 302 అవసరం లేదని పోలీస్ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఈ కేసుకు సంబంధించి ఫైనల్ హియరింగ్‌లో వాదనలు వింటామని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Updated Date - Dec 27 , 2023 | 04:19 PM