Telangana Rains: భారీ వర్షం తర్వాత ఇదీ పరిస్థితి...

ABN , First Publish Date - 2023-09-05T12:06:12+05:30 IST

భాగ్యనగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా మెట్రో స్టేషన్‌ను ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. మెట్రోస్టేషన్‌ల వద్ద ఎటు వెళ్లే దారి లేక మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోతున్నాయి.

Telangana Rains: భారీ వర్షం తర్వాత ఇదీ పరిస్థితి...

హైదరాబాద్: భాగ్యనగరాన్ని వర్షాలు (Heavy Rains)
అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. ముఖ్యంగా మెట్రో స్టేషన్‌ను (Metro Station) ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. మెట్రోస్టేషన్‌ల వద్ద ఎటు వెళ్లే దారి లేక మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాలు మెల్లిగా కదులుతున్న పరిస్థతి. నగరంలోని మూసాపేట్ మెట్రో స్టేషన్ కింద వరద నీరు నిలిచింది. ఎర్రగడ్డ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్ వైపు వచ్చే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


కొంపముంచిన మెట్రో డివైడర్

మరోవైపు ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రధాన రహదారిలో మెట్రో డివైడర్ కొంపముంచింది. మెట్రో డివైడర్ కారణంగా ఆ ప్రాంతంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దాదాపు రెండు కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈఎస్ఐ ఎర్రగడ్డ మార్గంలో వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ జీహెచ్ఎంసీ, మెట్రో రైల్ సిబ్బంది పత్తాలేకుండా పోయారు. చివరకు మెట్రో డివైడర్‌ను కొంత మేరకు పోలీసులు కూల్చివేశారు. దీంతో సుమారు అరగంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి.

Updated Date - 2023-09-05T12:08:39+05:30 IST