Telangana Rains: భారీ వర్షాలు... మేయర్‌పై మండిపడుతున్న సిటీజన్స్.. ఎందుకంటే?

ABN , First Publish Date - 2023-09-05T10:17:37+05:30 IST

నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలపై వాతావరణ శాఖ మూడు రోజుల ముందు అలెర్ట్ చేసినా.. జనాలను అలెర్ట్ చెయ్యడంలో జీహెచ్‌ఎంపీ పూర్తిగా విఫలమైంది. భారీ వర్షానికి కూడా మేయర్ విజయలక్ష్మి క్షేత్రస్థాయిలో పర్యటించని పరిస్థితి. కేవలం టెలికాన్ఫరెన్స్‌లకే మేయర్ పరిమితమవుతున్నారు.

Telangana Rains: భారీ వర్షాలు... మేయర్‌పై మండిపడుతున్న సిటీజన్స్.. ఎందుకంటే?

హైదరాబాద్: నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈరోజు (మంగళవారం) ఉదయం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలపై వాతావరణ శాఖ మూడు రోజుల ముందు అలెర్ట్ చేసినా.. జనాలను అలెర్ట్ చెయ్యడంలో జీహెచ్‌ఎంపీ పూర్తిగా విఫలమైంది. భారీ వర్షానికి కూడా మేయర్ విజయలక్ష్మి "(Mayor Vijayalaxmi) క్షేత్రస్థాయిలో పర్యటించని పరిస్థితి. కేవలం టెలికాన్ఫరెన్స్‌లకే మేయర్ పరిమితమవుతున్నారు. దీంతో నగర ప్రథమ పౌరురాలి తీరుపై సిటీజన్స్ మండిపడుతున్నారు. నీళ్లు నిలిచిన అన్ని ప్రాంతాల్లో చేరుకోలేకపోతున్న జీహెచ్‌ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు చేరుకోలేకపోతున్నాయి. వర్షం కారణంగా అనేక కాలనీలు నీటమునిగాయి. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని మియాపూర్‌లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-09-05T10:24:19+05:30 IST