Salaries: హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్.. ముందే పడ్డ జీతాలు

ABN , First Publish Date - 2023-09-06T12:09:32+05:30 IST

హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసేసింది.

Salaries: హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్.. ముందే పడ్డ జీతాలు

హైదరాబాద్: హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంగార్డు రవీందర్ ఎఫెక్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జీతాలు వేసేసింది. ప్రతీసారి పదవ తేదీన పడే జీతాలు ఈసారి ముందుగానే హోంగార్డుల ఖాతాల్లోకి వచ్చి చేరాయి. హోంగార్డ్ రవీందర్ ఆత్మహత్యాయత్నంతో రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డులకు ప్రభుత్వం త్వరితగతిన జీతాలు వేసేసింది.


కాగా.. ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం రెండు నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదంటూ రవీందర్ పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఉస్మానియా హాస్పిటల్‌కు హోం గార్డులు భారీగా తరలిరావాలని హోం గార్డ్ జేఏసీ పిలుపునిచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చెయ్యాలని హోమ్ గార్డ్‌ల సంఘం పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా హోంగార్డులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తమను పర్మినెంట్ చేయాలని గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న హోంగార్డులు.. ఈనెల 16, 17న పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చారు. హోంగార్డులు ఎవరు ఆత్మహత్యలకు పాల్పడొద్దని హోంగార్డు జేఏసీ పిలుపునిచ్చింది. తమన పర్మనెంట్ చేయాలని కేటీఆర్, హరీష్ రావు, కవితలను హోమ్ గార్డ్ జేఏసీ నేతలు కలిశారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో హోమ్ గార్డులు ఆందోళన బాట పట్టారు.

Updated Date - 2023-09-06T12:39:50+05:30 IST