Share News

Gangula Kamalakar: పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడు?

ABN , First Publish Date - 2023-11-22T13:25:57+05:30 IST

కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్‌ను చంపుతా అంటుండని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. వాడిది అసలు ఏ ఊరు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క రూపాయి ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండని గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు.

Gangula Kamalakar: పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడు?

కరీంనగర్ : మరో వారం మాత్రమే మిగిలివుండడంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. అన్ని పార్టీలకు చెందిన నేతలు, శ్రేణులు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యయి. ప్రత్యర్థి పార్టీలు, నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కరీంనగర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ బుధవారం ఆసక్తికరంగా మాట్లాడారు.

కేఏ పాల్ ఎవడు..? సీఎం కేసీఆర్‌ను చంపుతా అంటున్నాడని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. వాడిది అసలు ఏ ఊరు అంటూ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎవడు..? ఎక్కడి నుంచి వస్తున్నాడని మండిపడ్డారు. ఒక్క రూపాయి ఇయ్యను అన్న కిరణ్ కుమార్ తెలంగాణకు ఎందుకు వచ్చిండని గంగుల ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు దొంగలని.. ఢిల్లీ గులాములని పేర్కొన్నారు. బండి సంజయ్ తన మీద మూడోసారి ఓడిపోతాడన్నారు. గుండె పోటు డ్రామాను నమ్మొద్దని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-22T14:00:27+05:30 IST