Gone Prakash: మధుయాష్కీని టార్గెట్ చేస్తూ గోనె ప్రకాష్ తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2023-09-22T12:31:40+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత మాధుయాష్కీని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మధుయాష్కీ మోసగాడన్నారు. మధుయాష్కీ, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. న్యూయార్క్‌లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్‌గా యాష్కీని నిషేధించిందని చెప్పారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత మాధుయాష్కీని (Congress leader Madhuyashki)టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ (Former MLA Gone Prakash_ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మధుయాష్కీ మోసగాడన్నారు. మధుయాష్కీ, ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు ధ్రువపత్రాలతో విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. న్యూయార్క్‌లో ఒక ఆటార్నీని మోసం చేసినందుకు న్యూయార్క్ కోర్టు లాయర్‌గా యాష్కీని నిషేధించిందని చెప్పారు. మధుయాష్కీ న్యూయార్క్‌లో అటార్నీ కాదన్నారు. మధుయాష్కీ అమెరికాలో అంట్లు తోమారేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. దొంగ సర్టిఫికెట్లతో డిగ్రీలు సంపాదించారని ఆరోపించారు. కాకతీయ, గుల్బర్గా యూనివర్సిటీల నుంచి ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించానని తెలిపారు. గతంలోనే తనప ఆరోపణలపై యాష్కీ దాడి చేయించారని.. తాను చావుకు కూడా భయపడనని తెలిపారు. మధుయాష్కీపై హైకోర్టులో పోరాడుతున్నానని ఆయన అన్నారు.
జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఒక్క అంశంపై కూడా మధుయాష్కీ మాట్లాడలేదన్నారు. ఎల్బీ నగర్‌లో మధుయాష్కీకి డిపాజిట్లు కూడా రావని.. ఆయన వల్ల కాంగ్రెస్ 10 సీట్లు కోల్పోతుందని అన్నారు. నిజామాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. కర్ణాటకలో తన వల్ల రెండు సార్లు కాంగ్రెస్ గెలిచిందని అంటున్న యాష్కీ నిజామాబాద్2లో ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. జంగయ్య అనే చాకలి వ్యక్తిని వంట మనిషిగా అమెరికా తీసుకువెళ్లి అక్కడ ఆయన గ్రీన్ కార్డును ఇతరులకి అమ్ముకున్న వ్యక్తి మధుయాష్కీ అంటూ విరుచుకుపడ్డారు. 20 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి వచ్చారని.. మధుయాష్కీ వందల మందిని మోసం చేశారని ఆరోపించారు. మధుయాష్కీ జైలుకు పోవడం ఖాయమన్నారు. ఆయనను ఇంటర్ పోల్ వాళ్ళు పట్టుకుంటారని.. అమెరికాకు జీవితంలో పోలేరన్నారు. యాష్కీ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్తారని.. ఇండియాకు తిరిగివస్తారని గోనె ప్రకాష్ వ్యాఖ్యలు చేశారు.