Heavy Rains: ప్రగతిభవన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లాల్‌బంగ్లాలోకి వరద నీరు.. కన్నెత్తి చూడని జీహెచ్ఎంసీ
ABN , First Publish Date - 2023-09-05T13:17:32+05:30 IST
నగరంలో వర్ష బీభత్సం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేకుండా కురిసి వర్షానికి అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి.
హైదరాబాద్: నగరంలో వర్ష బీభత్సం అంతా ఇంతా కాదు. ఎడతెరిపిలేకుండా కురిసి వర్షానికి అనేక ప్రాంతాల్లో కాలనీలకు కాలనీలే నీటిలో మునిగిపోయాయి. పలు చోట్ల అపార్ట్‌మెంట్లలో మొదటి అంతస్తు వరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇటు బేగంపేట్‌లోని లాల్‌బంగ్లా భవనం వరద నీటిలో మునిగిపోయింది. సెల్లర్ పూర్తిగా నీట మునగడంతో దాదాపు 20కి పైగా షాప్‌లు నీటిలోనే ఉండిపోయాయి. దీంతో వ్యాపార వేత్తలు వరద నీటిని మోటర్లు సహాయంతో బయటకు పంపింగ్ చేస్తున్నారు. ప్రగతి భవన్‌కు కూత వేటు దూరంలో ఉన్న లాల్ బంగ్లాపై జీహెచ్ఎంసీ సిబ్బంది కన్నెత్తి చూడని పరిస్థతి. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్స్‌ను తామే తెరిచి వాటర్‌ను మళ్లించామని స్థానికులు చెబుతున్నారు. షాప్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో దుకాణాల్లోని వస్తువులు, డాక్యుమెంట్లు, ఫర్నిచర్ పూర్తిగా నీట మునిగాయి. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో దాన్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు