Durgam Chinnayya Victim: నా బాధ మీకు వినబడుట లేదా?..కేసీఆర్‌కు దుర్గం చిన్నయ్య బాధితురాలి విన్నపం

ABN , First Publish Date - 2023-06-15T14:16:20+05:30 IST

న్యాయం కావాలంటూ కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పార్టీ మీద పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే నా విన్నపమంటూ... ‘‘ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు.

Durgam Chinnayya Victim: నా బాధ మీకు వినబడుట లేదా?..కేసీఆర్‌కు దుర్గం చిన్నయ్య బాధితురాలి విన్నపం

న్యూఢిల్లీ: న్యాయం కావాలంటూ కొద్దిరోజులుగా పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య (BRS MLA Durgam Chinnayya) బాధితురాలు శేజల్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. పార్టీ మీద పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే నా విన్నపమంటూ... ‘‘ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నన్ను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారు అని గత 100 రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటలేదా?. నా బాధ మీకు వినబడుట లేదా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తనకు న్యాయం జరగడం లేదు అని ఢిల్లీ వచ్చి గత 25 రోజులుగా నిరసన తెలియజేస్తున్నట్లు తెలిపారు.

‘‘పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనివ్వరు మీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!. మాకు తెలంగాణలో స్వేచ్ఛ హక్కు లేదా? మేము తెలంగాణలో వ్యాపారం చేయకూడదా?. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా నన్ను వేధించి నా మీద తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్‌కు పంపి నా జీవితం ఎందుకు సర్వ నాశనం చేశారు?. ఈ తప్పులకి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వహించి తక్షణమే చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలి. నాకు న్యాయం జరగకపోతే ఢిల్లీలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు మీరు మహారాష్ట్ర, నాగపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా నాకు న్యాయం చేయాలని ఈరోజు ఢిల్లీలో మీ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నట్లు’’ శేజల్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-15T14:16:20+05:30 IST