Demolition: హైటెక్ సిటీలో రెండు భారీ భవనాల కూల్చివేత.. కారణమేంటంటే..?
ABN , First Publish Date - 2023-09-23T16:36:33+05:30 IST
హైటెక్ సిటీ(Hi-Tech City) లో రెండు భారీ భవనాల(Two Huge Buildings)ను కూల్చివేశారు.
హైదరాబాద్: హైటెక్ సిటీ(Hi-Tech City) లో రెండు భారీ భవనాల(Two Huge Buildings)ను కూల్చివేశారు. మైండ్ స్పేస్‌లోని రెండు బ్లాక్స్‌ను కూల్చివేశారు. క్షణాల్లో రెండు భవనాలు నేలమట్టమయ్యాయి. భవనాల కూల్చివేత సమయంలో బిల్డింగ్ ఓనర్స్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడంతో ఈ రెండు భవనలను కూల్చివేసినట్లు తెలుస్తోంది. మళ్లీ భారీ బిల్డింగ్స్‌ను నిర్మించేందుకు యజమానులు ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ కూల్చివేతకు టీఎస్ఐఐసీ నుంచి యజమానులు అనుమతులు తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడే మరింత ఎత్తులో బిల్డింగ్స్ కట్టాలని యజమానులు ప్లాన్ చేసినట్టు సమాచారం.