D Srinivas : ఇంకా విషమంగానే డి.శ్రీనివాస్ ఆరోగ్యం

ABN , First Publish Date - 2023-09-13T09:28:20+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఆయను ఐసీయూలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి డి. శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారు. 48 గంటల‌ పాటు అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.

D Srinivas : ఇంకా విషమంగానే డి.శ్రీనివాస్ ఆరోగ్యం

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఇంకా ఆయను ఐసీయూలోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు. శ్వాస తీసుకోవటానికి డి. శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నారు. 48 గంటల‌ పాటు అబ్జర్వేషన్ అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.

రెండు రోజుల క్రితం డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సిటీ న్యూరో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. డీఎస్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. డీఎస్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు పూజలు చేస్తున్నారు. ఇప్పటికే సిటి న్యూరో ఆస్పత్రికి అభిమానులు తరలివస్తున్నారు.

గతంలో కూడా..!

కాగా.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలోనే డీఎస్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పక్షవాతం కూడా సోకింది. మార్చి నెలలో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా ఇదే సిటీ న్యూరో సెంటర్‌కు తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత డీఎస్ కోలుకున్నారు కూడా. అయితే అంతా బాగుందనుకున్న టైమ్‌లో ఇప్పుడు సడన్‌గా ఇలా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. డీఎస్ ఆరోగ్యంపై కాంగ్రెస్ కీలక నేతలు ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నారు.

Updated Date - 2023-09-13T09:28:20+05:30 IST