Share News

2023 Crime Report: 2023 ఏడాది నేరాలపై సైబరాబాద్ సీపీ ఏమన్నారంటే?...

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:24 PM

Telangana: మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగితున్న సందర్భంగా 2023 ఏడాదిలో నేరాలపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి రివ్యూ నిర్వహించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం క్రైమ్ రెట్ పెరిగిందని సీపీ వెల్లడించారు.

2023 Crime Report: 2023 ఏడాది నేరాలపై సైబరాబాద్ సీపీ ఏమన్నారంటే?...

హైదరాబాద్: మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగితున్న సందర్భంగా 2023 ఏడాదిలో నమోదైన నేరాలపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి (Cyberabad CP Avinash Mahanti) రివ్యూ నిర్వహించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం క్రైమ్ రెట్ పెరిగిందని సీపీ వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాదిలో 29156 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యినట్లు తెలిపారు. ఈ ఏడాది 3432 మందికి శిక్షలు ఖరారు అయినట్లు చెప్పారు. అలాగే 5342 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అవగా.. సైబర్ క్రైమ్ ద్వారా రూ.232 కోట్లు మాయం అయినట్లు వెల్లడించారు. దీంట్లో రూ.46 కోట్లు రికవరీ అయినట్లు తెలిపారు. 277 డ్రగ్స్ కేసులు నమోదు అవగా.. 567 మంది అరెస్ట్ అయ్యారన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు అయ్యిందన్నారు. 6676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని.. డ్రగ్స్ కేసుల్లో రూ.27 కోట్లు విలువ చేసే మత్తుపదార్ధులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 52124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని.. ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా రూ.104 కోట్ల రూపాయల చలాన్‌లు విధించినట్లు చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 24318 మంది డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశామన్నారు. షి టీమ్స్ ద్వారా 2587 మంది అరెస్ట్ అయ్యారని.. 52 మందిపై పీడీ యాక్ట్ నమోదు అయినట్లు చెప్పారు.

సినిమా వాళ్లని వదిలిపెడుతున్నామనేది ఆరోపణే..

ఎమ్మెల్యే కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందన్నారు. శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సిఫార్సు లేఖలపై పోస్టింగ్‌లు ఉండబోవన్నారు. ప్రతి అధికారిపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. కేపీ చౌదరి డ్రగ్స్‌లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. కేపీ చౌదరి కన్ఫెస్ చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని తెలిపారు. లిస్ట్‌లో ఉన్న అందరినీ విచారణకు పిలుస్తున్నామన్నారు. వారు డ్రగ్స్‌తో ఉన్నపుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఎవరిని వదిలిపెట్టమని.. సినిమా వాళ్ళను వదిలి పెడుతున్నామనేది కేవలం ఆరోపణ మాత్రమే అని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్పష్టం చేశారు.


ఈ ఏడాది నమోదైన నేరాలు...

  • 105 హత్యలు

  • 61 చైన్ స్నాచింగ్

  • 62 రాబరీలు

  • 7 డేకాయిటి

  • 2353 దొంగతనాలు

  • 616 కిడ్నాప్‌లు

  • 259 రేప్ కేసులు

  • 6777 మోసాలు

  • 116 హత్యాయత్నాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 23 , 2023 | 12:47 PM