Hyderabad: కిషన్ రెడ్డిపై పార్టీలో తీవ్ర విమర్శలు
ABN , First Publish Date - 2023-12-04T11:00:09+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆ పార్టీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదు.. సొంత నియోజకవర్గం అంబరుపేటలో కూడా బీజేపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ ఓటమిపాలయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆ పార్టీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేదు.. సొంత నియోజకవర్గం అంబరుపేటలో కూడా బీజేపీ అభ్యర్థి కృష్ణాయాదవ్ ఓటమిపాలయ్యారు. కేంద్రమంత్రిగా ఉండి ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా విఫలయ్యారంటూ బీజేపీ క్యాడర్ విమర్శిస్తోంది.
కాగా తెలంగాణలో బీజేపీ మెరుగుపడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్న పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో పాటు.. 14 శాతం ఓట్ షేర్ సాధించింది. 19 స్థానాల్లో రెండో స్థానాల్లో పార్టీ అభ్యర్థులు నిలిచారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌లను ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణరెడ్డి సంచలనం నమోదు చేశారు.
హైదరాబాద్ గోషామహాల్ నుంచి రాజసింగ్ హ్యాట్రిక్ సాధించారు. ఈటల రాజేందర్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందనరావు భారీ తేడాతో ఓడిపోయారు. ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ఓటమి చెందారు. బీజేపీకి బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంశాలు కలిసొచ్చాయి. అయితే జనసేనతో బీజేపీ పొత్తు అంతగా ప్రభావం చూపలేదు. లక్ష్మణ్ నియజకవర్గం ముషీరాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి ఓటమి చెందారు.