Congress: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

ABN , First Publish Date - 2023-02-11T18:25:06+05:30 IST

కేసీఆర్ (KCR GOVT) సర్కారుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

హైదరాబాద్: కేసీఆర్ సర్కారుపై (KCR GOVT) కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ (Budget) పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కాంగ్రెస్ (Congress) పార్టీ చార్జ్షీట్ విడుదల చేసింది. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. 8 రెట్లు అప్పు చేశారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాల బడ్జెట్కు, వాస్తవ బడ్జెట్కు పొంతన లేదని మహేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందనడానికి బడ్జెట్ ప్రత్యక్ష సాక్షమని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఫిబ్రవరి మొదటి వారంలోనే బడ్జెట్ (Telangana Budget) ప్రజల ముందుకు వచ్చింది. రూ.2,90,396 కోట్ల మొత్తంతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్‌ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మారిన అధికార పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూసే దిశగా అడుగులు వేయడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ బడ్జెట్‌కు ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2023-02-11T18:29:10+05:30 IST