Share News

V.Hanumanthrao: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-04T10:43:56+05:30 IST

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. మొత్తం 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డే సీఎం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది.

V.Hanumanthrao: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress) భారీ విజయం సాధించింది. మొత్తం 64 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డే (TPCC Chief Revanth Reddy) సీఎం అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరికాసేపట్లో గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సీఎల్పీ సమావేశం జరుగనుంది. సీఎం ఎంపిక విషయంలో అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం కాండిడేట్‌పై సీనియర్ నేత వి.హనుమంతరావు (Congress Leader V.Hanumanth Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనే ఎక్కువ కష్టపడ్డారు. 80 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. నేను రేవంత్ సీఎం కావాలనుకుంటున్న. ఆయనకే నా మద్దతు’’ అని వీహెచ్ ప్రకటించారు.

Updated Date - 2023-12-04T11:21:31+05:30 IST