Share News

Chandrababu : చంద్రబాబు ఏఐజీకి వెళుతుండగా మార్గమధ్యంలో ఆసక్తికర ఘటన

ABN , First Publish Date - 2023-11-06T11:55:42+05:30 IST

టీడీపీ అధినత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) వెళ్లారు. కాసేపటి క్రితం ఆయన ఏఐజీకి చేరుకున్నారు. ఏఐజీకి చంద్రబాబు వెళుతున్న క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చేరుకుంది.

Chandrababu : చంద్రబాబు ఏఐజీకి వెళుతుండగా మార్గమధ్యంలో ఆసక్తికర ఘటన

హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) వెళ్లారు. కాసేపటి క్రితం ఆయన ఏఐజీకి చేరుకున్నారు. ఏఐజీకి చంద్రబాబు వెళుతున్న క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చేరుకుంది. మార్గమధ్యంలో ఆయన కోసం వేచి ఉన్న కార్యకర్తలను కాన్వాయ్ ఆపి మరీ మాట్లాడారు. దీంతో కేడర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఇప్పటికే రెండు రోజుల పాటు ఏఐజీలో టీడీపీ అధినేత వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలోనూ ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈరోజు చంద్రబాబుకు వైద్య బృందం పలు వైద్య పరీక్షలతో పాటు చర్మ సంబంధ చికిత్స చేయనున్నారు. మంగళవారం చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరుగనుంది.

Updated Date - 2023-11-06T12:01:25+05:30 IST