Hyderabad: నారా లోకేష్ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ

ABN , First Publish Date - 2023-01-25T12:10:00+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు బయలుదేరనున్నారు.

Hyderabad: నారా లోకేష్ నివాసానికి వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్‌ (NTR Ghat)కు బయలుదేరనున్నారు. ‘యువగళం (Yuvagalam)’ పాదయాత్ర (Padayatra)కు ముందు ఎన్టీఆర్‌కు నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా మామయ్య, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna), లోకేష్ నివాసానికి వచ్చారు. లోకేష్ కోసం ప్రత్యేక కర్వాన్ వాహనం సిద్ధం చేశారు. పాదయాత్రలో విశ్రాంతి, పార్టీ నేతలతో సమీక్షల కోసం కార్వాన్‌లో అధునాతన ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో కార్వాన్ వాహనం హైదరాబాద్ నుంచి కుప్పం బయలుదేరనుంది.

కాగా నారా లోకేష్‌ పాదయాత్ర ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించనున్నారు. మధ్యాన్నం 1.20 గంటలకు జూబ్లీహిల్స్‌లోని లోకేష్ తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ (Kasani Gnaneshwar) ఆధర్యంలో చంద్రబాబు (Chandrababu) ఇంటి నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించనున్నారు. తర్వాత 2.15 గంటలకు ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని కడపకు వెళ్లనున్నారు. అమీన్‌పీర్‌ దర్గా, మరియాపురం చర్చిలలో లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి 6.30 గంటలకు బయల్దేరి రోడ్డు మార్గాన తిరుమలకు వెళతారు. కుటుంబ సభ్యులతో కలిసి 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. 27వ తేదీన కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-01-25T12:10:00+05:30 IST