TS NEWS: హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ABN , First Publish Date - 2023-08-22T00:20:46+05:30 IST
నగరంలో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట(Mirpet)లో బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది.
హైదరాబాద్( Hyderabad): నగరంలో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట(Mirpet)లో బాలికపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటన.. స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మీర్‌పేటలో ఇంట్లో ఉన్న బాలికపై గంజాయి బ్యాచ్(Marijuana Batch) గ్యాంగ్‌రేప్ చేశారు. కత్తులతో బెదిరించి దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. దుండగులను సోదరుడు అడ్డుకోపోగా వారు గంజాయి మత్తులో ఉండి దాడి చేశారు. సోదరుడి ముందే యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఎవరికైనా చెపితే చంపేస్తామని బాలికను కామాంధులు బెదిరించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన తీరు గంజాయి బ్యాచ్ మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందో చాటుతోంది. స్థానిక పీఎస్‌లో బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో మంగల్ హాట్‌కు చెందిన ఓ రౌడీషిటర్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పరారీలో ఉన్న 8 మంది నిందితులు కోసం 7 బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా కొందరు మృగాళ్లు మారడం లేదు. మద్యం మత్తులో లైంగికదాడులకు తెగబడుతున్నారు. చిన్న, పెద్ద అని కూడా చూడటం లేదు. రోజుకో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఫోక్సో లాంటి కఠిన చట్టాలు ఉన్నా.. డ్రగ్స్ మత్తులో దారుణానికి పాల్పడుతూనే ఉన్నారు.