kothaguda flyover: హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ కానుక

ABN , First Publish Date - 2023-01-01T16:37:12+05:30 IST

న్యూ ఇయర్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ (Kothaguda Flyover)‌ను మంత్రి కేటీఆర్‌ (KTR) ప్రారంభించారు.

kothaguda flyover: హైదరాబాద్ వాసులకు న్యూ ఇయర్ కానుక

హైదరాబాద్: న్యూ ఇయర్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ (Kothaguda Flyover)‌ను మంత్రి కేటీఆర్‌ (KTR) జాతికి అంకితం చేశారు. ఎస్‌ఆర్‌డీపీ (SRDP)లో భాగంగా నిర్మించిన 18వ ఫ్లైఓవర్‌ ప్రారంభించారు. బొటానికల్ గార్డెన్ (Botanical Garden) నుంచి 3 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్‌ నిర్మించారు. కొత్తగూడ, కొండాపూర్‌ జంక్షన్లను కలుపుతూ మల్టీలెవల్‌ ఫ్లైఓవర్‌ (Multilevel flyover)ను నిర్మించారు. ఐటీ కారిడార్‌లో కేబుల్‌ వంతెనతో కలిపి ఇప్పటివరకు ఎనిమిది ఫ్లై ఓవర్లు వినియోగంలోకి వచ్చాయి. కొత్తగూడ వంతెనతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. 2018లో హఫీజ్‌పేట నుంచి కొత్తగూడ, కొండాపూర్‌, బొటానికల్‌ గార్డెన్‌, గచ్చిబౌలి వరకు 2.21 కిలో మీటర్ల మేర రూ. 263 కోట్ల బడ్జెట్‌తో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Updated Date - 2023-01-01T16:40:57+05:30 IST