TS NEWS: చందానగర్‌లో గోడ కూలి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-08-22T23:33:23+05:30 IST

నగరంలో దారుణం చోటుచేసుకుంది. గోడ కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చందానగర్ పాపిరెడ్డి కాలనీ(Chandanagar Papireddy Colony)లో జరిగింది.

TS NEWS: చందానగర్‌లో  గోడ కూలి వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. గోడ కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చందానగర్ పాపిరెడ్డి కాలనీ(Chandanagar Papireddy Colony)లో జరిగింది.చందానగర్ పోలీస్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలో పాత ఇంటి గోడను కూల్చే క్రమంలో గోడ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో అక్కడే పని చేస్తున్న జై చంద్రరావు(46) పై గోడ పడి మృతిచెందాడు. తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్‌కు తరలించే క్రమంలో చంద్రరావు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-08-22T23:38:27+05:30 IST