Vamsi Chander Reddy: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్..
ABN , First Publish Date - 2023-07-12T16:59:02+05:30 IST
న్యూఢిల్లీ: తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్ పతనం అవుతుందని ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ..
న్యూఢిల్లీ: తెలంగాణ (Telangana)లో రానున్నది కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్ (BRS) పతనం అవుతుందని ఏఐసీసీ సెక్రటరీ వంశీ చందర్ రెడ్డి (Vamsi Chander Reddy) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సొంత ఇంటి పార్టీని కాపాడుకోలేక కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయలేదని వంశీ చందర్ రెడ్డి ప్రశ్నించారు. కౌలు రైతులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, భయంతో కాంగ్రెస్‌పై అసత్యప్రచారలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్‌కు నూకలు చెల్లాయని, ఆ పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ రైతుల పార్టీ అని, రైతుల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు ఉంటుందన్నారు. బాషీర్‌బాగ్‌లో రైతులపై తూటాలు పేల్చారని, నాటి ప్రభుత్వంలో కేసీఆర్ కూడా భాగస్వామి అని వంశీ చందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.