Share News

Oath Ceremony: రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-12-07T13:50:18+05:30 IST

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Oath Ceremony: రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం తరువాత వరుసగా మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. ముందుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇలా వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఎల్బీస్టేడియంలో కన్నుల పండువగా జరిగిన ప్రమాణస్వీకార మహోత్సవానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్‌ సహా పలువురు ప్రముఖులు ప్రమాణస్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-12-07T13:58:55+05:30 IST