Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

ABN , First Publish Date - 2023-03-07T20:36:11+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి విదేశానికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద మంగళవారం కస్టమ్స్‌ అధికారులు..

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి విదేశానికి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద మంగళవారం కస్టమ్స్‌ అధికారులు విదేశీ కరెన్సీ (Foreign currency)ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ అధికారుల కథనం ప్రకారం.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లే ఈకే 527 విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా.. అందులో విదేశీ కరెన్సీ లభించింది. అయితే, కరెన్సీకి సంబంధించిన డాక్యుమెంట్లు చూపకపోవడంతో ప్రయాణికుడిని అరెస్టు చేశారు. అధికారులు ఆ కరెన్సీని దుబాయ్‌ (Dubai)కి చెందిన దీరమ్స్‌గా గుర్తించారు. వాటి విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.11లక్షలు ఉంటుందని గుర్తించారు. ఈమేరకు కరెన్సీని స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-07T20:36:11+05:30 IST