Fact Check: అమృత ప్రణయ్ మళ్లీ పెళ్లికి సిద్ధమైందా? అసలు విషయం ఇదే..!!

ABN , First Publish Date - 2023-08-19T12:28:41+05:30 IST

కొన్ని రోజుల క్రితం అమృత తన అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 18 నిమిషాల నిడివి గల ఓ వీడియోను షేర్ చేసింది. తన స్నేహితురాలి ఎంగేజ్‌మెంట్‌కు తన హడావిడి అంటూ అమృత సదరు వీడియోలో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పెళ్లి కోసం రెడీ అవుతున్న తీరుపై అందులో రాసుకొచ్చింది. అయితే వీడియో పూర్తిగా చూడని వారు అమృత మళ్లీ పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది.

Fact Check: అమృత ప్రణయ్ మళ్లీ పెళ్లికి సిద్ధమైందా? అసలు విషయం ఇదే..!!

2018, సెప్టెంబర్ 14న తెలంగాణలో చోటు చేసుకున్న పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మారుతీరావు కుమార్తె అమృత వేరే కులానికి చెందిన ప్రణయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడం తండ్రి మారుతీరావుకు నచ్చలేదు. దీంతో ప్రణయ్‌ను కిరాయి గూండాలతో పకడ్బందీగా ఆయన హత్య చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న అమృత తన తండ్రిపై కేసు పెట్టింది. ఈ కేసు పోలీసుల విచారణలో ఉండగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత గర్భవతి. అనంతరం ఆమె బాబుకు జన్మనిచ్చింది. తాజాగా ఆమె మరో పెళ్లికి సిద్ధమైందని సోషల్ మీడియా ప్రచారం సాగుతోంది. దీంతో ఇది నిజమా.. అబద్ధమా అంటూ నెటిజన్‌లు ఆరా తీస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే.. కొన్ని రోజుల క్రితం అమృత తన అఫీషియల్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో 18 నిమిషాల నిడివి గల ఓ వీడియోను షేర్ చేసింది. తన స్నేహితురాలి ఎంగేజ్‌మెంట్‌కు తన హడావిడి అంటూ అమృత సదరు వీడియోలో పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్ పెళ్లి కోసం రెడీ అవుతున్న తీరుపై అందులో రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. అయితే వీడియో పూర్తిగా చూడని వారు అమృత మళ్లీ పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం మొదలు పెట్టారు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. అమృత రెడీ అవుతోంది తన పెళ్లి కోసం కాదని.. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి కోసమని స్పష్టమైంది. కొందరు నెటిజన్‌లు కావాలనే అమృతపై దుష్ప్రచారం చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఈ కుర్రాడు ఎంత తెలివైనవాడు.. టీచర్ దగ్గర ఎలా మాట్లాడాలో తండ్రికే నేర్పుతున్నాడు.. క్యూట్ వీడియో వైరల్!

కాగా ప్రణయ్ మరణం తర్వాత అమృత తన తల్లితండ్రులకు చాలా కాలం పాటు దూరంగా ఉంది. హైదరాబాద్‌లోనే నివసిస్తూ తన బిడ్డ ఆలనా పాలన చూసుకోవడంతో పాటు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కాలం నెట్టుకొస్తోంది. తండ్రి ఆత్మహత్య అనంతరం అంటే ప్రణయ్ మరణించిన దాదాపు ఐదేళ్ల తర్వాత అమృత తన తల్లిని కలిసింది. అటు అమృత.. ఇటు ఆమె తల్లి ఇద్దరూ భర్తలను కోల్పోవడంతో కలిసి జీవించాలని అందరూ ఆకాంక్షించారు. కాలం చేసిన గాయాలు మానాలంటే తల్లీకూతుళ్లు కలిసి ఉండాలని కోరుకున్నారు. కక్షలు, కుతంత్రాలతో పరువు హత్యలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

Updated Date - 2023-08-19T12:40:52+05:30 IST