KTR: కేంద్రం నిధులపై నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా

ABN , First Publish Date - 2023-01-10T16:30:21+05:30 IST

కేంద్రం నిధులపై నా సవాల్‌కు కట్టుబడి ఉన్నాను. కేంద్రాన్ని తెలంగాణ (Telangana) రాష్ట్రమే పోషిస్తోంది. ఇది తప్పయితే రాజీనామా చేసి వెళ్తా..

KTR: కేంద్రం నిధులపై నా సవాల్‌కు కట్టుబడి ఉన్నా

హైదరాబాద్: ‘‘కేంద్రం నిధులపై నా సవాల్‌కు కట్టుబడి ఉన్నాను. కేంద్రాన్ని తెలంగాణ (Telangana) రాష్ట్రమే పోషిస్తోంది. ఇది తప్పయితే రాజీనామా చేసి వెళ్తా.. లేదంటే మీరు చేస్తారా?’’ అని బీజేపీ నేతలను మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. బీజేపీ (BJP) పార్టీని నడిపించేది మూర్ఖులని మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇస్తే.. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) వద్దంటారా? అని ప్రశ్నించారు. ఆయనకు అసలు తెలివి, మెదడు ఉందా అని కేటీఆర్ నిలదీశారు. కరీంనగర్‌ (Karimnagar)కు సంజయ్ ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు. వేములవాడకు ప్రధాని మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. మోదీ దేవుడంటూ బీజేపీ నేతలు డబ్బాలు కొడుతున్నారని, సెస్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ట్రైలర్ చూపించామన్నారు. బీజేపీకి ఈ ఏడాదిలోనే అసలు సినిమా చూపిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - 2023-01-10T16:30:23+05:30 IST