TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై నిపుణులతో చర్చించాం: కేటీఆర్
ABN , First Publish Date - 2023-03-18T19:53:44+05:30 IST
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak)పై నిపుణులతో చర్చించామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. పేపర్ లీక్‌పై సీఎం కేసీఆర్
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ (TSPSC Paper Leak)పై నిపుణులతో చర్చించామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. పేపర్ లీక్‌పై సీఎం కేసీఆర్ (CM KCR)కు నివేదిక ఇచ్చామని చెప్పారు. పేపర్ లీకేజీ వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. రద్దయిన పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. గతంలో హాజరైనవారిని అర్హులుగా గుర్తిస్తామన్నారు. కోచింగ్ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని, నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తుండడంతో టీఎస్‌పీఎస్సీ (TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1తోపాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం టీఎ్‌సపీఎస్సీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజా నిర్ణయంతో మొత్తం ఆరు పరీక్షలను రద్దు చేసినట్లయింది.