పునీత్ నుంచి తారకరత్న వరకూ.. తాజాగా ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్‌గా..

ABN , First Publish Date - 2023-02-24T08:24:10+05:30 IST

హార్ట్ అటాక్‌తో విశాల్ (24) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. అతి చిన్న వయసులో పైగా జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.

పునీత్ నుంచి తారకరత్న వరకూ.. తాజాగా ఓ కానిస్టేబుల్ జిమ్ చేస్తూ సడెన్‌గా..

హైదరాబాద్ : హార్ట్ అటాక్‌తో విశాల్ (24) అనే కానిస్టేబుల్ మృతి చెందాడు. అతి చిన్న వయసులో పైగా జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. విశాల్ 2020 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. 2023లో ఉద్యోగాన్ని సంపాదించి ఆసీఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విశాల్ బోయిన్ పల్లిలో నివాసముంటున్నాడు. గురువారం సాయంత్రం సికింద్రాబాద్‌ (Secunderabad)లోని ఓ జిమ్‌లో వ్యాయమం చేస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలిపోయి మరణించాడు. చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో అంతా జరిగిపోయింది.

ఇటీవల మనం ఎక్కువగా వింటున్న మాట హార్ట్ ఎటాక్ (Heart attack) లేదంటే కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest). అప్పటి వరకూ చాలా యాక్టివ్‌గా కనిపించి ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. పునీత్ రాజ్‌కుమార్ (Punith Rajkumar) నుంచి తారకరత్న (Tarakaratna) దాకా.. గుండెపోటుతో మృత్యువాత పడిన వారే. నిత్యం వ్యాయామం చేసేవారినీ కూడా హార్ట్ ఎటాక్ వదులడం లేదు. ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. హార్ట్ ఎటాక్.. కార్డియాక్ అరెస్ట్.. కారణమేదైనా నాలుగు పదుల వయసులోనే చాలా మంది ఊపిరి ఆగిపోతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి, తిరిగి లేవడం లేదు.

గతంలో స్థూలకాయులు, కాస్త వయసు పైబడిన వారు గుండెపోటుతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా సరే గుండె పోటు ముప్పు నుంచి తప్పించుకోలేక పోతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీ కాల కత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ సడెన్‌గా కుప్పకూలి మృతి చెందిన ఘటన మరవక ముందే విశాల్ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేస్తోంది.

Updated Date - 2023-02-24T09:22:22+05:30 IST