Ponguleti: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం

ABN , First Publish Date - 2023-07-21T19:49:46+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వ (KCR government) విధానాలపై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ponguleti: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం

ఖమ్మం: కేసీఆర్ ప్రభుత్వ (KCR government) విధానాలపై కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.


"రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి గిఫ్ట్‌గా ఇవ్వాలి. అధికార పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెబుతాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు. ఎవరైనా సరే కాంగ్రెస్ జెండా కిందనే పనిచేయాలి. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేయాలి." అని పొంగులేటి అన్నారు.


కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కార్గే పుట్టినరోజు సందర్భంగా వైరాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కేక్ కట్ చేశారు. పొంగులేటి సమక్షంలో పలు పార్టీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Updated Date - 2023-07-21T19:51:44+05:30 IST