Share News

High Court: 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీఎం ఆదేశం

ABN , Publish Date - Dec 14 , 2023 | 09:18 PM

వచ్చే నెలలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎం సూచించారు.

High Court: 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సీఎం ఆదేశం

హైదరాబాద్: వచ్చే నెలలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజేంద్రనగర్‌లో 100 ఎకరాల్లో నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సీఎం సూచించారు. గురువారం ఎంసీహెచ్‌ఆర్‌డీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే.. సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన సీఎం వద్ద ప్రస్తావించారు. హైకోర్టు శిధిలావస్థకు చేరినందున కొత్త భవనం నిర్మించాలని హైకోర్టు సీజే కోరారు. హైకోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. అలాగే కొత్త జిల్లాల్లో కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీజే కోరారు.

Updated Date - Dec 14 , 2023 | 09:22 PM