CM Revanth: సీఎం రేవంత్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2023-12-10T13:21:07+05:30 IST
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రారంభించడంపై కాంగ్రెస్ శ్రేణులు
ఖైరతాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రారంభించడంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఆదివారం ఖైరతాబాద్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి(Vijaya Reddy) ఆధ్వర్యంలో మహిళలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో రెండింటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు రోజుల్లోనే నెరవేర్చిన ఘనత రేవంత్‌రెడ్డిదని ఆమె పేర్కొన్నారు. అలాగే, సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఖైరతాబాద్‌లో విజయారెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు.