Thatikonda Rajaiah: జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యేను: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-06T22:07:05+05:30 IST

స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 17వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు.

Thatikonda Rajaiah: జనవరి 17 వరకు నేనే ఎమ్మెల్యేను: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

జనగామ: స్టేషన్ ఘనపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 17వరకు తానే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. అదే రోజు తన ఎమ్మెల్యే పదవికి చివరి రోజు అని చెప్పారు. జాఫర్‌ఘడ్‌లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో మార్పులు జరుగుతాయని స్వయంగా సీఎం కేసీఆరే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే టికెట్లు రాని వాళ్లకు టికెట్లు రావొచ్చని, టికెట్లు ఇస్తామని చెప్పిన వాళ్లకు ఇవ్వకపోవచ్చని రాజయ్య అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే, ఎన్నికలు మరింత ఆలస్యమూ కావొచ్చని చెప్పారు. ఈలోగా ఏమైనా జరగొచ్చని అన్నారు. కడియం శ్రీహరి ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నారని, కానీ తాను ఓడినా, గెలిచినా ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. ప్రజల మధ్య ఉండే నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారని రాజయ్య అన్నారు. కాగా తాటికొండ రాజయ్యకు ఈ సారి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని సంగతి తెలిసిందే. సర్పంచ్ నవ్యతో ఉన్న వివాదం ఆయనకు టికెట్ దక్కుకుండా చేసిందనే చెప్పుకోవాలి.

Updated Date - 2023-09-06T22:07:05+05:30 IST