BJP MLA: నిధులు కేంద్రానివి.. గొప్పలు రాష్ట్రానివి..

ABN , First Publish Date - 2023-08-22T13:33:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ తమ గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని, బీఆర్‌ఎస్‌

BJP MLA: నిధులు కేంద్రానివి.. గొప్పలు రాష్ట్రానివి..

ఆత్మకూరు(ఎస్), నల్గొండ: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తూ తమ గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి కాలం చెల్లిందని పాండిచ్చేరి బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌బాబు(Pondicherry BJP MLA Ashok Babu) అన్నారు. సోమవారం ఎమ్మెల్యే ఆవా్‌సయోజన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రజాప్రయోజనాల కోసం బీజేపీ ఎన్నో సం క్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే ఆవాస్‌ యోజన కార్యక్రమం చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు బూత్‌స్థాయిలో ప్రచారం చేసి ఇంటింటికీ తెలియజేసి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ(BJP)ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గత ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన భూములను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వేదికలు, వన సంరక్షణ పేరుతో లాక్కొని నిరుపేదలను చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు సంకినేని వరుణ్‌రావు, బీజేపీ మండల అధ్యక్షుడు పందిరి రాంరెడ్డి, కర్నాటి కిషన్‌, రవి, సంధ్యాల సైదులు, పాటి కరుణాకర్‌ రెడ్డి, వెంకట్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్‌ రెడ్డి, సారయ్య, లింగరాజు, మల్లయ్య, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.

bjp.jpg

Updated Date - 2023-08-22T13:33:02+05:30 IST