Share News

MP Prabhakar Reddy: ప్రభాకర్ రెడ్డి ఆగోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-10-30T21:35:49+05:30 IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( BRS MP Kotha Prabhakar Reddy )పై గటని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

MP  Prabhakar Reddy: ప్రభాకర్ రెడ్డి  ఆగోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు ఏమన్నారంటే..

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి‌ ( BRS MP Kotha Prabhakar Reddy ) పాల్గొన్నారు. ఎంపిపై ఒక్కసారిగా గటని రాజు అనే వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రభాకర్ రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద ఆస్పత్రిలో ప్రభాకర్ రెడ్డికి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.

ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేశాం: డాక్టర్ విజయ్ కుమార్

శస్త్ర చికిత్స అనంతరం కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమర్జెన్సీ కి షిఫ్ట్ చేసినట్లు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ...‘‘శస్త్ర చికిత్స చేయడం కొద్దిసేపటి క్రితం ముగిసింది. కత్తిగాటుతో ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమికంగా కుట్లు వేసి హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ ప్రసాద్ బాబు, వినీత్ వైద్యుల టీం ప్రభాకర్ రెడ్డికి చికిత్స అందించారు. ఆయనకు ఇంటస్టైన్ కి గాయం ఉంది. 3 గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స చేయడం కష్టం అని గుర్తించాం. రెండు పేగులు కలిపి 4 చోట్ల ప్రభాకర్ రెడ్డికి గాయం అయింది. చిన్న పేగులో 15 సెంటి మీటర్ల వరకు తొలగించాము. ఈ తరహా శస్త్ర చికిత్స జరిగినప్పుడు రోగి త్వరగా కోలుకోవడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వైద్యం గురించి తెలియజేస్తాం. మెడికో లీగల్ కేస్ కాబట్టి అన్ని శాంపిల్లు సేకరించి ఉంచాం. 4 రోజుల తర్వా తే ఆయన పూర్తిగా కొలుకుంటున్నారో లేదో చెప్పగలం. 4 రోజుల తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డిని నార్మల్ వార్డ్ కి షిఫ్ట్ చేస్తాం. ప్రభాకర్ రెడ్డి కి హైపర్ టెన్షన్ ఉంది’’ అని డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.

కుడి భాగానా 6 సెంటీమీటర్ల కత్తి ఘాటు ఉంది: డాక్టర్ ప్రసాద్ బాబు

ప్రభాకర్ రెడ్డి బొడ్డుకి కుడి భాగానా 6 సెంటీమీటర్ల కత్తి ఘాటు ఉందని డాక్టర్ ప్రసాద్ బాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సిటీ స్కాన్ లో శరీరం లోపల బ్లీడింగ్ అవుతునట్టు గుర్తించాం. చిన్న పేగుకి 4 చోట్ల గాయం అయినట్టు తెలిసింది. కీ హోల్ తో శస్త్ర చికిత్స చేయలేమని గుర్తించాం. త్వరితగతిన ప్రభాకర్ రెడ్డి ఆస్పత్రికి రావడంతో ఇన్ఫెక్షన్ రాలేదు. ఆయన ప్రాణాలు కాపాడగలిగాము. 15 సెంటీమీటర్ లు ఉన్న చిన్న పేగును తొలగించి కుట్లు వేశాం. ప్రభాకర్ రెడ్డి 10 రోజుల వరకు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది. దాదాపు 100 మంది వైద్యులు ఆయన కోసం ఒక టీం గా పని చేశాము. కత్తి గాటు లోపల ఎక్కువగా ఉంది’’ అని డాక్టర్ ప్రసాద్ బాబు తెలిపారు.

Updated Date - 2023-10-30T21:45:20+05:30 IST